
వరుస ఫ్లాప్లతో అసలే కష్టాల్లో ఉన్న హీరో గోపిచంద్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. కొత్త దర్శకుడితో భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా గోపిచంద్ హీరోగా తెరకెక్కించాలని భావించిన ప్రాజెక్ట్ను ఆపేశారు. స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ తొలి వలపు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే తొలి సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో విలన్గా టర్న్ అయ్యాడు.