
బడా హీరోలందరూ షూటింగ్స్ లో బిజీ ఉండగా చిన్న చిత్రాల హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో వారు వరుసగా చిత్రాలు విడుదల చేస్తున్నారు. గతవారం మరియు నేడు టాలీవుడ్ నుండి చాలా తక్కువబడ్జెట్ చిత్రాలు విడుదల అవుతున్నాయి. స్టార్ హీరో మూవీల విడుదల సమయంలో వీరికి థియేటర్ల సమస్యతో పాటు, పోటీవలన ఆదరణ తక్కువగా ఉంటుంది, అందుకే మూవీని విడుదల చేయడానికి ధైర్యం చేయరు. కాగా నేడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు చిత్రాలు విడుదల అవుతున్నాయి.