
సూపర్ స్టార్ మహేష్ బాబు తెలియని వారు సౌత్ లోనే ఉండరు. తన హ్యాండ్సం లుక్స్ తో ఈ వయసులో కూడా అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నాడు. మహేష్ బాబు కుటుంబం గురించి కూడా పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఫంక్షన్స్ లో తరచు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా మహేష్ కూతురి చలాకీతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఆటపాటలకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మహేష్ సినిమా రిలీజ్ అవుతుందంటే సితార ఆ సినిమాలో ఏదైనా పాటకు డ్యాన్స్ చేయాల్సిందే. అలానే మొన్నీమధ్యే డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు అధ్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు సితార భారీ ఆఫర్ ను దక్కించుకుంది. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న 'ఫ్రోజెన్-2' తెలుగు వెర్షన్ కోసం సితార డబ్బింగ్ చెప్పనుంది. సినిమాలో బేబీ 'ఎల్సా' పాత్రకు సితార తన వాయిస్ ని అందించింది. మొత్తానికి చిన్న వయసులోనే సితార దూసుకుపోతుంది.