
తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో కార్తీ మొదటి నుంచి తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే తన డబ్ సినిమాలకు తెలుగు నేర్చుకోని మరి డబ్బింగ్ చెప్తున్నాడు. అయితే కార్తీ నటించిన తాజా సినిమాకు చిరంజీవికు స్టార్ హీరో స్టేటస్ తెచ్చిపెట్టిన సినిమా 'ఖైది' టైటిల్ ను పెట్టిన విషయం తెలిసిందే. ఖైది టైటిల్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ తో నడుస్తుంది. టైటిల్ ప్రభావంతో పాటు కథ కూడా అంతే బలంగా ఉండటంతో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అందుకేనేమో మరోసారి చిరంజీవి లక్ ను ఫాలో అవుదామని ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. ప్రస్తుతం తమిళంలో ‘తంబి’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో 'దొంగ' అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. చిరంజీవిది 'దొంగ' పేరుతో పాత సూపర్ హిట్ సినిమా ఉందన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి కూడా లక్ కలిసొచ్చిందేమో చూడాలి.