
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మాటల యుద్ధం నడుస్తున్నట్లుగా ఉంది. ఒకరి తర్వాత ఒకరు నా వంతు వచ్చిందన్నట్లు సెటైర్లు వేసుకుంటూ... ఆరోపణలు చేసుకుంటున్నారు. జగన్ మూడు పెళ్లిలు చేసుకున్న పవన్ అంటే... పవన్ ఉరుకుంటాడా ? ఆక్రోశంతో ఊగిపోతూ నువ్వు చేసుకో మూడు పెళ్లిలు అంటూ మాటల తూటాలను వదిలాడు. ఈ క్రమంలో పవన్ ను జగన్ రెడ్డి అని సంబోధించడం జరిగింది. ఇప్పుడు అదే తప్పయిందంటున్నారు వైకాపా ఎమ్మెల్యేలు. రెడ్డి అని ఎలా పిలుస్తారంటూ పవన్ పై మండిపడుతున్నారు. దానికి సమాధానంగా తాజాగా పవన్ మాట్లాడుతూ "కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేయాలన్నది తమ సిద్ధాంతామని తెలిపారు. జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. జాతీయ మీడియా మొత్తం జగన్ రెడ్డి అనే సంబోధిస్తుంన్నారు. తన పిలుపుకు రాజకీయ దురుద్దేశాలు జోడించి పవన్ నాయుడు అని ఎగతాళి చేయటం తప్పన్నారు. జగన్ను ఏమని పిలవాలో మీ 151మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేస్తే అలానే పిలుస్తానని ఎగతాళి చేశారు.