
కొన్ని నెలల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ఓయ్ జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ తీసుకునే నిర్ణయాలపట్ల జాతీయ మీడియా సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్ తీసుకున్న తాజా నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... తప్పు పడుతున్నారు. రాజధానిలో సింగపూర్ స్టార్ట్అప్ ప్రాజెక్టును రద్దు చేయటంపట్ల ప్రముఖ దినపత్రిక ఎకనామిక్స్ టైమ్స్ ఓ ఎడిటోరియల్ రాసింది. దాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు పవన్ కళ్యాణ్. ఆ ఎడిటోరియల్ ను పోస్ట్ చేస్తూ..."175 అసెంబ్లీ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ లో 151 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే...వచ్చిన ఐదు నెలల్లోనే 35లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేసి, యాభై మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైకాపాకే దక్కుతుందని" ట్వీట్ చేశారు.