
ఎన్నికల్లో వైకాపా అత్యంత మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నో రోజుల కష్టం తర్వాత జగన్ కు సీఎం పదవి దక్కింది. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి జగన్ ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. అయితే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై అనంతపూర్ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. ట్రాన్స్పోర్ట్ లో తనకు 74 ఏళ్ల అనుభవం ఉందని...అలాంటిది తమ బస్సులను ఎలా సీజ్ చేస్తారని ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు 80 బస్సులను సీజ్ చేసారు. అదేంటని అడిగితే....బస్సు టైంకు రాలేదని అందుకనే సీజ్ చేశామని అంటున్నారు. టైంకు రాకపోతే సీజ్ చేస్తారా? ఇదెక్కడి న్యాయమని ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కొందరిని మానసికంగా... కొందరిని ఆర్థికంగా శిక్షిస్తోందని జేసీ ధ్వజమెత్తారు. పార్టీలో ఉంటే ఎటువంటి కేసులు ఉండవు...పార్టీలో లేకపోతే లేని కేసులను పెడతారని ఆరోపించారు.