
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేతలపై వైకాపా ముఖ్యనేత ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. ఇసుక కొరతపై చంద్రబాబు ఏర్పాటు చేసిన దొంగ దీక్షకు కనీసం ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఎం చేస్తున్నారో తెలియట్లేదని వ్యాఖ్యానించారు. ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడలో ఇసుక పొట్లాలు వేసుకున్నారని సెటైర్ వేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ను కూడా ఓ రేంజ్ లో విమర్శించారు. 'నిత్య కళ్యాణం' గురించి సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే అంటూ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి... సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడని పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట అని కామెంట్ చేశారు. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై దోమలకు కష్టకాలమే అంటూ ట్వీట్ చేశారు.