
కులమతాలకు అతీతంగా తమ పార్టీ పనిచేస్తుందని, ప్రజలకు మంచి పరిపాలన అందించడమే తమ లక్ష్యమని చెప్పిన జనసేన...ఏదైనా సమస్య వస్తే పోరాడేందుకు సిద్ధం అవుతారని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత కొనసాగుతున్న విషయం విదితమే. ఇసుక కొరత కారణంగా ఇప్పటికే 50మంది ప్రాణాలు కోల్పోగా...35 లక్షలమంది నిర్మాణ కార్మికులు తమ ఉపాధి కోల్పోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కొరతను అరికట్టే దిశగా అడుగులు వేసుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు ఆందోళనలు, లాంగ్ మార్చ్ చేసిన జనసేన....ఇసుక కొరత ప్రభుత్వం పరిష్కరించే వరకు ఊరుకునేది లేదని, దానికి తగ్గ చర్యలు చేపట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా జనసైనికులకు, అక్రమ ఇసుక తవ్వకాలపై ఓ కన్నేసి ఉంచాలని పిలుపునిచ్చారు. ఇసుక అవినీతిపై ఇప్పుడే పోరాటం మొదలైంది, జనసైనికులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు జగన్ కు శాండ్ పాలసీలో జరిగిన తప్పులను వివరించిన మీడియా, రాజకీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.