
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయం అయ్యారు. అంతేకాదు షో మూలంగా ఆ కమెడియన్స్ కు వెండితెరపై కూడా ఎన్నో అవకాశాలు వచ్చి...కొంతమంది స్టార్ కమెడియన్స్ గా కూడా చెలామణి అవుతున్నారు. అనసూయకు జబర్దస్త్ యాంకర్ అనసూయ అంటూ ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఈ షోలో అనసూయ అందచెందాలు చూసి ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలానే, నాగబాబు నవ్వుల కోసం అభిమానులు వెయిట్ చేస్తారు. అలాంటి షో నుంచి ఇప్పుడు నాగబాబు, అనసూయ జంప్ అయ్యి జబర్దస్త్ కు పోటీగా జీ తెలుగులో ప్రసారంకాబోతున్న లోకల్ గ్యాంగ్స్ లో దర్శనమివ్వనున్నారు. 7 సంవత్సరాలుగా తిరుగులేని టిఆర్పీతో రన్ అవుతున్న మల్లెమాల ప్రొడక్షన్ వారి జబర్దస్త్ కు పోటీగా ఎన్నో షోలు వచ్చి నిలబడలేకపోయాయి. మొదట పార్లమెంట్ స్థాయి అఖిల పక్ష సమావేశం ఎందుకు పెడతారో ఫస్ట్ తెలుసుకో అంటూ హెచ్చరించారట. నాగబాబు, అనసూయ వారితో పాటు జబర్దస్త్ టీంలో కొంతమందిని తమవెంట తీసుకోని వెళ్లే అవకాశం లేకపోలేదు.