
ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆ షోను హోస్ట్ చేయటంతో యాంకర్ అనసూయ కూడా బాగా ఫెమస్ అయింది. ఎంత ఫెమస్ అంటే...ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో వచ్చిన మీకు మాత్రమే చెప్తాలో కూడా తన యాక్టింగ్ తో మెప్పించింది. ఎన్ని సినిమాలు చేసిన రంగస్థలంలో రంగమ్మత్తగా ఆమె నటన టాప్ లో ఉంటుంది. ఆ పాత్ర ఆమెకు అంతే పేరు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ ను ఆమెకు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించే సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం అనసూయను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే అనసూయకు మరో హిట్ ఖాతాలో పడినట్లే!