
ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి అనే విద్యార్థి కమ్యూనిస్టు భవనలు ఉన్న వ్యక్తి. పోరాటాల్లో, విద్యార్థుల కోసం గొంతెత్తి మాట్లాడడంలో ముందుంటాడు. మరి అలాంటి వ్యక్తికి విద్యార్థులు పట్టం కట్టకుండా ఉంటారా? ఉస్మానియాలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన జార్జి రెడ్డిని గెలిపించారు. గెలిసిన అనంతరం తనదైన రీతిలో ముందుకెళ్తూ చెరగని ముద్ర వేయడం....అది చూసి ఓర్వలేని మరో సంఘం పక్కా ప్రణాళికతో జార్జి రెడ్డిని హతమార్చడం తెలిసిన విషయమే. ఇప్పుడు ఇదే కథను జార్జి రెడ్డి పేరుతో తెరపై చూప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక దాని తర్వాత వివాదాలు ఈ సినిమాను చుట్టుముడుతూనే ఉన్నాయి. తాజాగా జార్జి రెడ్డి ట్రైలర్ చూసిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ట్రైలర్ లో కేవలం ఒక సైడ్ నుంచే చూపిచ్చారని... ఈ సినిమాతో ఏబీవీపీను కించపరిస్తే మాత్రం ఉరుకునేదిలేదని హెచ్చరించారు. సినిమాకు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇచ్చిందని.. దీనిలోని కొన్ని సీన్లను కట్ చేయాలని స్పష్టం చేశారు.