జూ.ఎన్టీఆర్ కు సుమ సవాల్..! గ్రీన్ ఛాలెంజ్ ను మరొకరి నుండి స్వీకరించిన సీనియర్ నటి జయసుధ..
4 years ago

ఈ మధ్యకాలంలో ప్రకృతిపై అవగాహన తెచ్చే దిశగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అడుగులు వేస్తున్నారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. అందుకనే టీఆరెస్ ఎంపీ సంతోష్ కుమార్ హరితహారం పేరుతో మొక్కలను నాటే ఛాలెంజ్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ను మరొకరి నుండి స్వీకరించిన సీనియర్ నటి జయసుధ మొక్కలను నాటి యాంకర్ సుమను నామినేట్ చేశారు. ఆ ఛాలెంజ్ ను స్వీకరించిన సుమ బేగంపేటలోని మయూరి స్టూడియోలో మూడు మొక్కలను నాటి...దీన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ కు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి.... ఈ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా నటుడు జూ. ఎన్టీఆర్, బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మంచు లక్ష్మి, దర్శకనిర్మాత ఓంకార్ లను నామినేట్ చేస్తూ....మొక్కలను నాటాలని సవాల్ విసిరారు.