
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చింది వైకాపా. ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం జెరూసలేం యాత్రికులకు నిజంగా శుభవార్తే. జెరూసలేం వెళ్తున్న ప్రయాణికులకు ఆర్థిక సహాయం పెంపుపై గత క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. క్యాబినెట్ ఉత్తర్వులను జారీచేసింది. వార్షికాదయం రూ.3 లక్షలకు తక్కువ ఉన్న వారికి ఆర్థిక సాయం రూ.40వేల నుండి రూ.60వేలకు పెంచినట్లు తెలిపారు. అలానే వార్షికాదయం రూ. 3లక్షలకు ఎక్కువ ఉన్నవారికి రూ. 20 వేల నుండి వేలకు పెంపును ప్రకటించింది. జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనా స్ధలాల సందర్శనకు ఆర్ధిక సాయం కూడా అందివ్వనుంది.