
టీఆరెస్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు మెమో చిక్కెదురైంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అయిన రాజయ్య జనగాం జిల్లాలోని చెల్పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యారు. అదేంటి ? కార్యక్రమంకు వెళ్లి బుక్కవడం ఏంటి? అనుకుంటున్నారా... అక్కడే ఉంది అసలు మ్యాటర్. ఫంక్షన్ కు వెళ్లిన ఆయన పదో తరగతి అమ్మాయి గోరుముద్దలు పెడుతుంటే...హాయిగా తింటూ ఫోటోలకు పోజిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు ఆయన్ను వేసుకుంటున్నారు. ఆ వీడియోలో ఆ అమ్మాయి అన్నం కూరలు ప్లేట్ లో పెట్టుకోని వచ్చి..కలిపి ఆయనకు గోరుముద్దలు పెడుతుంటే...పక్కన ఒక బాలుడు వాటర్ బాటిల్ పట్టుకోని నిలబడ్డాడు. ఈ వీడియో చూసిన ప్రజలు...కాళ్ళు, చేతులు బాగానే ఉన్నాయిగా నువ్వు తినలేవా అంటూ మండిపడుతున్నారు. దీంతో చేసేదేంలేకా రాజయ్య ఈ ఘటనపై స్పందిచారు. 'సోషల్ మీడియాలో అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఆ పాటశాలకు తరుచు వెళ్తుంటాను. ఆమె నా కూతురు లాంటిది. అంకుల్ నేనే మీకు తినిపిస్తా అంటూ గోరుముద్దలు పెట్టిందని' వివరణ ఇచ్చారు.