
కిలోమీటర్లు కిలోమీటర్లు పాదయాత్ర చేసి, జనంతో కలిసి నడిచి వారికి బుగా దగ్గరయ్యి మంచి స్ట్రాటజీతో ఎన్నికల్లో గెలిచారు వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి సంచలన నిర్ణయాలతో అబ్బురపరుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంను ఉన్నపళంగా బదిలీ చేసి.. గుంటుంరు జిల్లా బాపట్ల లోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో మార్పుపై కూడా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈవోగా బాధ్యతలు కొనసాగిస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో జేఎస్వీ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రానుంది.