
టీడీపీలో కీలక నేతగా ఉన్న వల్లభనేని వంశీ మొన్నీమధ్యే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చర్చలు జరిపి...వైకాపాలో త్వరలో చేరనున్నట్లు తాజా సమావేశంలో వెల్లడించారు వంశీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ...అనేక అంశాలపై చంద్రబాబు నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు నిర్ణయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు చూస్తున్న నేతలు తట్టుకోలేక పార్టీని విడుతున్నారని ఆరోపించారు. ఈమేరకు టాలీవుడ్ హీరో నందమూరి ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు వల్లభనేని వంశీకు మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. 2009లో టీడీపీ కోసం ఎన్టీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరి ప్రచారం చేశారు. అలాంటి ఎన్టీఆర్ గత 10ఏళ్లగా పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పండి అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా నల్లపూసగా మారిపోయారని వంశీ అనడం చర్చనీయాంశంగా మారింది. వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.