
ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజుకో మలుపు తిరుగుతుంది. అసలే అప్పుల్లో మునిగిపోయిన ఆర్టీసీని ఎగ్గొట్టిన కార్మికుల పీఎఫ్ రూ.760 కోట్లు ఈ నెల 15లోపు కట్టాల్సిందిగా చెప్పి మరో షాక్ ఇచ్చింది న్యాస్థానం. కట్టాల్సిన పీఎఫ్ కట్టకపోతే కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో ఆర్టీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇకపోతే తమకు న్యాయం జరగలంటూ నేడు మిలియన్ మార్చ్ కు కార్మిక సంఘాలు సిద్ధమయినప్పటికి వారి మిలియన్ మార్చ్ చేసేందుకు పోలీసుల నుంచి అనుమతి దక్కలేదు. అయినప్పటికీ మిలియన్ మార్చ్ చేస్తామని పిలుపునివ్వటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా సామాన్య ప్రజలను ట్యాంకుబండ్ పరిసర ప్రాంతాలకు వెళ్లనివ్వకుండా ఆంక్షలు పెట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించడంతో… ట్రాఫిక్ అస్తవ్యస్థంగా తయారైంది. అయితే మిలియన్ మార్చ్ కు కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు పలకడంతో ముందస్తు చర్యగా కొంతమంది నేతలను హౌజ్ అరెస్ట్ చేయగా...ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అరెస్ట్ చేశారు.