
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. బాహుబలి సినిమాతో ఇండియాస్ హైయ్యస్ట్ గ్రాసర్ హీరోగా రికార్డ్ సృష్టించిన ప్రభాస్, ఇప్పుడు తన ప్రతీ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా సాహో సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ముందు తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. ఈ సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా వసూళ్లు విషయంలో మాత్రం ప్రభాస్‌కు తిరుగులేదని ప్రూవ్ చేసింది.ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ను కూడా మూడు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు జిల్ ఫేం రాధకృష్ణ దర్శకుడు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.