
కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన రా రస్టిక్ మూవీ అసురన్. విలక్షన నటుడు ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెట్రీమారన్ దర్శకుడు. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి ధనుష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో ధనుష్ నటన, వెట్రిమారన్ టేకింగ్‌కు అవార్డులు రివార్డులు ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.