
సమంత అక్కినేని, ఎటువంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి...తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోని..మొదటి సినిమా నుంచే ప్రేమలో ఉన్న నాగచైతన్యను పెళ్ళాడి అక్కినేని కోడలు అయింది. అక్కినేని కుటుంబంలోకి వెళ్లిన నాటి నుంచి సమంత పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ రోల్స్ కు ప్రాధాన్యం ఇస్తుంది. ఆమె నటించిన తాజా చిత్రం ఓ బేబీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్ లో తమిళ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ లో నటిస్తుంది. ఇది పక్కన పెడితే... తల్లి బాధ్యతలు ఏంటి? అనుకుంటున్నారా....కంగారు పడకండి. సమంత తల్లి కాలేదు. అసలు విషయం ఏంటంటే...సమంతాకు హాష్ అనే కుక్క ఉంది. దానికి స్నానాలు చేయించటం, దాని అల్లరిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడ్తూ 'తల్లి బాధ్యతలు' అనే ట్యాగ్ లైన్ ఇచ్చి తరచూ పోస్ట్ చేస్తుంటుంది. సమంత కుక్క హాష్ అక్కినేని ఫోటోలను, వీడియోలను నెటిజన్లు కూడా తెగ ఇష్టపడుతున్నారు.