
బీజేపీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది విజయశాంతి. కానీ తన తల్లి తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తో కలిసి నడిచి ఉద్యమంలో కీలకంగా మారింది. తర్వాత కాంగ్రెస్ లోకి మారిన ఇమే అడపాదడపా వార్తల్లో నిలుస్తోంది. అయితే విజయశాంతి మళ్ళీ తన సొంతగూటికి చేరనున్నదని జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి కారణం లేకపోలేదు. తాజాగా అయోధ్య తీర్పుపై ఆమె చేసిన పోస్ట్ ఈ ప్రచారంకు ప్రాణం పోసింది. రామమందిర్ నిర్మాణం జరగనుందని దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంటే కేసీఆర్ మాత్రం ఎంఐఎంతో అవగాహన ఉండబట్టే నోరు మెదపడంలేదని ఓ బీజేపీ నేత మాట్లాడినట్లుగా వ్యాఖ్యానించింది. దీంతో రాములమ్మ తిరిగి బీజేపీకు వెళ్లనుందని కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. అదికాక కాంగ్రెస్ ఇప్పట్లో పుంజుకునే అవకాశం కనిపించటం లేదు... అందుకని ఫుల్ ఫామ్ లో ఉన్న బీజేపీలోకి వెళ్తే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం.