
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే అలాంటి మాటల మాంత్రికుడికు సూపర్ స్టార్ మహేష్ బాబుకు విబేధాలు వచ్చాయని వినిపిస్తుంది. ఈ రూమర్ రావటానికి కారణం లేకపోలేదు. నిన్న గురూజీ పుట్టినరోజు అని అందరికి తెలిసిన సంగతే. సినీ ప్రముఖులంతా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. కానీ మహేష్ మాత్రం ఇగ్నోర్ చేశారు. నిన్న నటుడు కమల్ హస్సన్ పుట్టినరోజు కూడా. ఆయన్ను గుర్తుపెట్టుకోని కమల్ ను పొగుడుతూ సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అందరికి గుర్తున్న గురిజి బర్త్ డే మహేష్ కు గుర్తులేదా? మహేష్ కు అతడు లాంటి కెరియర్ బెస్ట్ సినిమాను అందించిన దర్శకుడిని అలా ఎలా మర్చిపోతాడు? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఫోన్ చేసి విష్ చేసి ఉండోచ్చు కదా అంటూ మహేష్ ఫ్యాన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసి, కొన్ని యాడ్స్ కూడా చేసిన మహేష్ ఇలా ఇగ్నోర్ చేయటం కాస్త నిరాశ కలిగించే విషయమే.