
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 ఘనంగా ముగిసింది. 15మంది కంటెస్టెంట్స్, రెండు వైల్డ్ కర్స్ ఎంట్రీలతో 105 రోజుల పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాహుల్,శ్రీముఖి,బాబా భాస్కర్,శ్రీముఖి,అలీ ఫైనల్స్ లో ఉండగా రాహుల్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. ఇదిలా ఉండగా... సీజన్ మొత్తంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం రాహుల్, పునర్నవిలే. దానికి కారణం లేకపోలేదు...వీరి మధ్య జరిగిన సంభాషణలు, చిలిపి గొడవలు, అలుగుళ్ళు, సైగలు, ఒకరిపై ఒకరు చూపించుకున్న ప్రేమ ఇవ్వని ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. ఈ జోడికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అయితే మా మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమేనని వాళ్ళు కొట్టిపారేసిన అది నమ్మశక్యంగా లేదు. ఇకపోతే విజేతగా తిరిగి వచ్చిన రాహుల్ పునర్నవికు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈనేపథ్యంలో రాహుల్ అమ్మానాన్నలు మాట్లాడుతూ...వాళ్ళు ప్రేమించుకున్నది లేనిది మాకు తెలియదు. బిగ్ బాస్ వాళ్ళు టిఆర్పీ కోసం కూడా అలా చూపించి ఉండొచ్చు. అయితే వారి మధ్య నిజంగా ప్రేమ ఉందా లేదా అనేది వాళ్లే చెప్పాలి. ఒకవేళ వారు ప్రేమించుకుంటే పెళ్లి చేయటానికి మాకేమి అభ్యంతరం లేదని చెప్పారు. మరి రాహుల్, పునర్నవిలు అసలు ఉన్నదేంటో చెప్పి...పెళ్లి పీటలు ఎక్కుతారో లేదో చూడాలి.