
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ వరుస ఇంటర్వ్యూస్ తో బిజీగా ఉన్నాడు. తీరిక లేకుండా మీడియా ఛానెల్స్ లో దర్శనమిస్తూ వైరల్ అవుతున్నాడు. అయితే సీజన్ మొత్తంలో రాహుల్ పునర్నవిలు హైలెట్ గా నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో వీరి మధ్య జరిగే సంభాషణల కోసం, గొడవల కోసం ప్రేక్షకులు విపరీతంగా వైట్ చేసే వాళ్లు. బిగ్ బాస్ పుణ్యమాని ఈ జంట పిచ్చి పిచ్చిగా వైరల్ అయింది. మరి ఇంత వైరల్ జంట గురించి అడగకుండా మీడియా ఛానెల్స్ వదులుతాయా? తాజాగా రాహుల్ ని ఇంటర్వ్యూ చేసిన ఒక ప్రముఖ ఛానెల్ పునర్నవితో సినిమా చేసే అవకాశం వస్తే చేస్తారా? అని అడగగా....ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. 110 పర్సెంట్ సినిమా చేస్తానని తన ఇష్టాన్ని తెలిపాడు. ఇక ఈ మాట కాస్త తెలుగు సినిమా దర్శకనిర్మాతల చివిన పడే ఉంటుంది. ఈ జంటతో సినిమా తీస్తే వాళ్లకు ఉన్న క్రేజ్ కారణంగా మంచి రిజల్ట్ ఉంటుందని భావించి సినిమా తీసినా తీస్తారు.