
సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ పుకార్లు సర్వ సాధారణం. సెలెబ్రిటీలు ఎంత సైలెంట్ గా, మీడియాకు చిక్కకుండా ప్రయత్నించినా పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఈ జాబితాలో రానా ముందుటారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియదు కానీ తనపై రోజుకో పుకారు పుట్టుకొస్తుంది. ఆ మధ్య నటి త్రిషతో డేటింగ్ చేసాడని, పెళ్లి వరకు వెళ్లిందని జోరుగా వినపడింది. ఇప్పుడు మరోసారి ఈ దగ్గుబాటి హీరోపై రూమర్ పుట్టుకొచ్చింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామని అయినా రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో రకుల్ రానా ప్రేమలో పడిందంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా జరిగిన ఒక భేటీలో రకుల్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. నేను రానాతో ప్రేమలో ఉన్నాను అనే దాంట్లో ఎంత మాత్రం నిజం లేదని....మా ఇళ్లులు పక్క పక్కనే ఉండటంతో తరుచు కలుస్తూ ఉంటామని దాని వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని...మేమిద్ దరం మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చింది.