
సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇక ఆయన రెమ్యునరేషన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తున్న"దర్బార్"లో నటిస్తున్నారు. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. రూ.250కోట్ల భారీ బడ్జెట్ తో తెరక్కెక్కిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. అయితే రజనీకాంత్ చివరి చిత్రం అయిన రోబో 2.0కు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోని వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు దర్బార్ కోసం ఏకంగా రూ.100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇదే గనుక నిజమైతే దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్‌గా రజనీకాంత్ మరోసారి రికార్డుల్లోకి ఎక్కుతారు.