
మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న మహాభారతంలో ద్రౌపది పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ నటించనున్నారు. ఈ పాత్రను తాను అంగీకరించడంతో పాటు ఈ ప్రతిష్టాత్మక మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు దీపిక వెల్లడించారు. బాజీరావు మస్తానీ, పద్మావత్ వంటి పీరియాడిక్ ఫిల్మ్స్‌లో అలరించిన దీపిక తనకు మహాభారతంలో ద్రౌపది పాత్ర లభించడం జీవితకాల అవకాశమని అభివర్ణించారు. ద్రౌపది దృక్కోణంలో మహాభారతాన్ని ఈ సినిమా ఆవిష్కరించడం ఆకట్టుకునే అంశమని ఆమె చెప్పుకొచ్చారు. మహాభారతం కథలుకథలుగా మనం తరతరాలుగా చెప్పుకున్నా అవన్నీ పురుషుడి ఆధారంగా అల్లుకున్న కథలు కాగా తొలిసారిగా మహిళ కోణంలో ఈ కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు.ద్రౌపది పాత్రలో నటించడం తాను గౌరవంగా భావిస్తున్నానని, థ్రిల్‌కు గురవుతున్నానని అన్నారు. ప్రతిష్టాత్మక చారిత్రక దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్న ఫిల్మ్ మేకర్ మధు మంతెన స్పందిస్తూ ద్రౌపది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా రూపొందడం విలక్షణమని చెప్పారు.