
నందమూరి తారకరామారావు భార్య నందమూరి లక్ష్మీపార్వతి టీడీపీకు ఎప్పటి నుంచో దూరంగా ఉన్నారు. పార్టీకి దూరంగా ఉండటమే కాకుండా చంద్రబాబు నాయుడుపై ఎన్నో విమర్శలు చేసేవారు. నిత్యం ఆయనపై మండిపడుతూ ఉండేవారు. ఆ మధ్య లక్ష్మీపార్వతి సొంతగా పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండి...వైకాపాలో చేరారు. ఎన్నికల సమయంలో జగన్ వెంట నడిచి పార్టీకి కీలకంగా మరారు. అంత కీలకంగా ఉన్న లక్ష్మీపార్వతికి ఎలాంటి పదవి ఇస్తారోనని రాజకీయాల్లో ఆసక్తి నెలకుంది. అయితే ఆమెకు తగ్గ పదవినే కట్టబెట్టారు సీఎం జగన్. తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా లక్ష్మీపార్వతిని నియమించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లక్ష్మీపార్వతికి పురాణాలు, ఇతిహాసాల మీద అపారమైన జ్ఞానం ఉండడంతో ఆమెకు తగ్గ పదవి ఇచ్చారని చెప్పుకుంటున్నారు.