
మెగస్టార్ చిరంజీవితో "సైరా నరసింహ రెడ్డి" లాంటి పిర్యాడికల్ ఫిల్మ్ తీసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో చేసిన సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తో నేను బలవంతంగా సినిమా చేయాల్సొచ్చిందని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఎన్టీఆర్ తో కలిసి సురేందర్ అశోక్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...నేను ఎన్టీఆర్ తో అశోక్ సినిమా బలవంతంగా చేశాను. తారక్ మ్యానేజర్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సిందేనని హెచ్చరించడంతో చేసేదేమీ లేకా సినిమా తెరకెక్కించానని వ్యాఖ్యానించారు. ఒకవేళ తారక్ తో సినిమా చేయకపోతే నీకు ఇండస్ట్రీలో అవకాశాలు ఉండవని మ్యానేజర్ బెదిరించినట్లు తెలిపారు. ఇది విన్న ఎన్టీఆర్ అభిమానులు...మా హీరో అలాంటివాడు కాదు. కావాలనే ఇదంతా చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.