మెగాబ్రదర్ నాగబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది…మెగా ఫ్యాన్స్ షాక్

మెగాబ్రదర్ నాగబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ, బుల్లితెరపై జబర్దస్త్ షో జడ్జ్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. నాగబాబుకు సినిమాల్లో కంటే జబర్దస్త్ షో జడ్జ్ గా ఎక్కువ పేరొచ్చింది అనడంలో సందేహం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్త్ర జబర్దస్త్ షోలకు జడ్జీలాగా ఉన్న నాగబాబు, రోజా నవ్వులకే అభిమానులు ఉన్నారు. ఆమధ్య ఎసెంబ్లీ ఎన్నికల కోసం జబర్దస్త్ కు కొంతకాలం విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. నాగబాబు తన తమ్ముడు పార్టీ అయిన జనసేన తరుపున నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దాంతో యధావిధిగా జబర్దస్త్ షో జడ్జ్ గా రీఎంట్రీ ఇచ్చారు. కానీ ఒడిపోయినప్పటికి నేను ఎక్కువ శాతం రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. తాజాగా నాగబాబు జబర్దస్త్ షో నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఇప్పటి వరకు ఆ షోను డైరెక్ట్ చేస్తున్న నితిన్- భారత్ లను యాజమాన్యం తొలగించిందట. నాగబాబుకు వారితో మంచి అనుబంధం ఉండటంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్టు చెబుతున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే అభిమానులు నాగబాబు నవ్వులను మిస్ అవ్వటం గ్యారెంటీ.