
దక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. లేదంటే సౌత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కేది. అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. తెలుగులోనూ నిత్యా మీనన్‌ను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువే. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తరవాత అన్నీ మంచి మంచి పాత్రలే చేశారు. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాల్లో కనిపించారు.