
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. వారిద్దరూ కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మహేష్ యొక్క 'శ్రీమంతుడు' యొక్క ఆడియో లాంచ్ కు వెంకటేష్ కూడా హాజరవ్వడం జరిగింది. అభిమానులు వారిని 'పెద్దొడు', 'చిన్నోడు' అని ఆప్యాయంగా పిలుస్తారు. అయితే ఈ రెండు ఫ్యామిలీలకు మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా మహేష్ బాబు తండ్రి కృష్ణ, విక్టరీ వెంకటేష్ కలిసి 80లలో దిగిన ఫోటో ప్రస్తుతం నెట్ లో హల్చల్ చేస్తుంది.