
ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. హీరోకి అయినా హీరోయిన్‌కి అయినా ఎన్ని రోజులు కాలం కలిసొస్తుందో చెప్పలేని పరిస్థితి. నటి కిరణ్ రాథోడ్ అదే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన కనిపించిన ఈ భామకు ఇప్పుడు ఆఫర్స్ కరువయ్యాయట. కిరణ్ సోషల్ మీడియా ప్రొఫైల్ చూసిన ఫ్యాన్స్ ఆమె పోస్టుల వెనుక ఆఫర్ల కోసం ఎదురుచూపులు కనిపిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. ఇదే విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిరణ్ ను అడగగా..."నిజమే, నేను అవకాశాల కోసమే అలాంటి ఫోటోలు, వీడియోలు పెడుతున్నాను. దర్శకనిర్మాతలకు నేను ఇంకా నటనకు పనికొస్తాను అని చెప్పడానికే పెడుతున్నాని అన్నారు. నేను డైరక్టర్లు, యాక్టర్ల వెంట వెంట వెళ్లలేదు కాబట్టి నాకు అవకాశాలు రావట్లేదని అన్నారు. ఒకప్పుడు వచ్చిన ఆఫర్లు ఇప్పుడెందుకు రావట్లేదో అర్ధం కావట్లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. నా కట్టుబాటులకు వ్యతిరేకంగా నేను ఏ పని చేయలేదు కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాని" తెలిపారు.