
బుల్లితెర అయినా వెండితెర అయినా అవకాశాలు రావడానికి పరిచయాలు చాలా ముఖ్యం. మరి ముఖ్యంగా వెండితెరపై టాలెంట్ కన్నా పరిచయాలు అవకాశాలను తెచ్చిపెడ్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే అప్పుడప్పుడే వస్తున్న యాక్టర్స్ దగ్గర నుండి స్టార్ యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా ప్రతి ఒక్కరు పార్టీ ఏదైనా ఉంటే అట్టెండ్ అవుతుంటారు. కారణం నలుగురిలో కనిపిస్తాం...మనకి అవకాశం వస్తుందేమోనని ఆశ. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని బాలీవుడ్లో బాగా చెలామణీ అవుతున్న ఈ పార్టీ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ కు కూడా పాకింది. అయితే పార్టీలకు వెళ్తే అవకాశాలు వస్తాయనేదానిపై రకుల్ తాజా ఇంటర్వ్యూలో గట్టిగానే సమాధానం ఇచ్చింది. కేవలం పార్టీలకు అవకాశాలు వస్తాయనుకోవడం మీ అపోహ అని కొట్టిపారేసింది రకుల్. ఈమె మాటలు విన్నవాళ్లు.. బాలీవుడ్ పార్టీలకు హాజరవుతూ ఉండే ఈ బ్యూటీకి పార్టీలతో అవకాశాలు రావని అనుభవంతో చెబుతోందని అంటున్నారు.