
ప్రముఖ యాంకర్ రవి, ఈ పేరును తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. లేడీ డామినేటెడ్ ఫీల్డ్ లోకి వచ్చి...తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నాడు. ఒక పక్క టీవీ షో, ఆడియో ఫంక్షన్లు, ఈవెంట్స్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు. లేడీ యాంకర్స్ తో రవి పండించే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. మరి ముఖ్యంగా ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్ షోలో రవి వేసే బోల్డ్ జోక్‌లు చాలా ఫెమస్. ఆ షో రవికు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ షో నుండి రవి త్వరలో తప్పుకొనున్నట్లు సమాచారం. కారణం లేకపోలేదు... పటాస్ షో నిర్వాహకులు మల్లెమాల సంస్థ చేస్తే కేవలం ‘పటాస్’ షో మాత్రమే చేయాలి. వేరేవి చేయడానికి వీళ్లెదని కండిషన్స్ పెట్టిందట. దీంతో చేసేదేంలేకా పటాస్ షో వదులుకుంటున్నాడట. రవి స్థానంలో నోయేల్ ను కానీ జబర్దస్త్ ఫన్ చంటిను కానీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.