
జగన్ పవన్ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కాస్త హద్దు మీరీ జగన్ నీకు పద్ధతి పాడు లేదంటూ ఆక్రోశంతో ఊగిపోయారు. తాజాగా దీనిపై మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నాడు. తాము ఊరుకున్న కొద్ది పవన్ హద్దుమీరుతున్నాడని ఆరోపించారు. పవన్ మాటల్లో కేవలం అహంకారం కనిపిస్తుందని... ఏమి చూసుకొని ఆ అహంకారమో అర్ధం కావడంలేదని వ్యాఖ్యానించారు. పవన్ కు అసలు రాజకీయ లక్షణాలే లేవని రోజు రోజుకి దారుణంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవాలి...మిగితా వారి పిల్లలు మాత్రం చడవకూడదా? అని ప్రశ్నించారు. పిల్లలు ఇంగ్లీష్ లో పట్టలేక ఇబ్బంది పడుతున్నారని....నేను కూడా ఇంగ్లీష్ లో పట్టులేక ఇబ్బంది పడ్తున్నానని అన్నారు.