
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయటం, మంచి పరిపాలన అందించడమే తన లక్ష్యం అంటూ జనసేన పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. తాజాగా ఇసుక సమస్యపై లాంగ్ మార్చ్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా....పవన్ రీఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు కొన్ని రోజుల క్రితం శుభవార్త అందింది. హిందీలో సూపర్ హిట్ అయినా 'పింక్' సినిమాను తెలుగులో దిల్ రాజు, బోని కపూర్ సంయుక్త నిర్మాణంలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ను అడగగా...అయన చేసేందకు అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే ఇండస్ట్రీలో త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి తెలియని వారు ఉండరు. జల్సా సినిమాతో మొదలైన వీళ్ళ ప్రయాణం నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఏ సినిమాకు డైలాగ్స్ రాయటానికి ముందుకు రాణి త్రివిక్రమ్ 'పింక్' రీమేక్ కోసం డైలాగ్స్ రాయమని అడగగానే అంగీకరించినట్లు తెలుస్తుంది. దానికి కారణం పవన్ ఇందులో నటిస్తుండడమే. అసలే రీఎంట్రీ.....దానికి తోడు మాటల మాంత్రికుడు రంగంలోకి దిగాడు. ఇక సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పాల్సిన పని లేదు.