
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు తన వదిన తనకు తల్లితో సమానమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్ ఎందుకు చెప్పాడో ఇప్పుడు అర్థం అవుతుంది. ఎలా అంటారా? పవన్ తో నటించమని చిరు సతీమణి ఒక సీనియర్ నటిని ఇంటికి పిలిచి మరీ అడిగారట. ఆమె ఎవరో కాదు నటి రాశీ. అప్పట్లో ఆమె అందాలతో కుర్రకారుకు పిచ్చెకించింది. అప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కావటంతో మరిది సినిమాలో నటుస్తే కెరియర్ బాగుంటుందని భావించిన సురేఖ రాశీను ఇంటికి పిలిచి పవన్ తో గోకులంలో సీత సినిమాలో నటించమని అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా రాశీ చెప్పడం విశేషం. మరిది సినిమా కోసం కెరియర్ కోసం చిరు సతీమణి ఇంత చేశారు కాబట్టే పవన్ తనకు తల్లితో సమానమని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. తన మరిది కెరీర్ కోసం చిరు సతీమణి ఎంతలా ఆరాట పడ్డారో తాజా మాటలు స్పష్టం చేస్తాయని చెప్పాలి.