
రాజకీయ నేతలు అన్నాక ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకోవడం మాములే. ప్రొఫెషనల్ గా కాకుండా పర్సనల్ గా కూడా ఎటాక్ చేస్తుంటారు. తాజాగా ఏపీ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే ఫాలో అయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతపరమైన వ్యాఖ్యలు చేసారు. విజయవాడలో నిర్వహించిన విద్యా, మైనారిటీ దినోత్సవంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ పలు రాజకీయ నేతల్ని పర్సనల్ గా ఎటాక్ చేసారు. అయ్యా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు అంటూ మొదలుపెట్టి... పవన్ కు ముగ్గురు భార్యలు, నాలుగురో అయిదుగురో పిల్లలు ఉన్నారు. వారిని ఏ మీడియంలో చదివిస్తున్నారు లేదా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు, వెంకయ్య నాయుడులను కూడా ప్రశ్నించారు. పిల్లలకు చదువే ఆస్థి. ప్రతి పేద వాడికి చదువు అందాలన్నారు. ఏ పేదింట్లో కూడా స్కూళ్లకు వేళ్ళని పిల్లవాడు ఉండకూడదని అన్నారు. దీని కోసం ఏపీ ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందన్నారు.