
పార్లమెంట్ స్థాయి అఖిల పక్ష సమావేశాలు మొదలయిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా జరిగిన సమావేశంలో విజయ్ సాయిరెడ్డిపై బీజేపీ నేత అమిత్ షా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశంలు హాజరయ్యేందుకు చిదంబరంకు బెయిల్ ఆమోదించాలంటూ కాంగ్రెస్ నేతలు కోరుతున్న సమయంలో విజయ్ సాయిరెడ్డి అవసరం లేని జగన్ కేసుల ప్రస్తావన తెచ్చారట. ఇక ఒక్కసారిగా అఖిలపక్ష నేతలంతా అసహనం గురయ్యారట. మరి ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా తీవ్రమైన అసహనంకు గురయ్యి...కాంగ్రెస్ అడగాల్సింది అడిగింది, మేము నోట్ చేసుకున్నాం మధ్యలో మీకు కలిగిన ఇబ్బందేంటి అని ప్రశ్నించారట. ఇక్కడ జరుగుతున్నదేంటి మీరు మాట్లాడ్తున్నదేంటి...ఎక్కడ ఎం మాట్లాడలో తెలియదా? అని మండిపడ్డారట. మొదట పార్లమెంట్ స్థాయి అఖిల పక్ష సమావేశం ఎందుకు పెడతారో ఫస్ట్ తెలుసుకో అంటూ హెచ్చరించారట.