
బిగ్ బాస్ సీజన్ 3 భారీ అంచనాల నడుమ మొదలై కొన్ని రోజుల క్రితం ఘనంగా ముగిసింది. గ్రాండ్ ఫైనల్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. శ్రీముఖి,రాహుల్,బాబా భాస్కర్,అలీ, వరుణ్ లు ఫైనల్స్ లీక్ నిలవగా...రాహుల్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి కన్నా రాహుల్ కు ఎక్కువ శాతం ఓట్లు రావటంతో అతన్ని విజేతగా ప్రకటించింది బిగ్ బాస్. అయితే విన్నర్ అయిన కారణంగా రాహుల్ కు రూ. 50 లక్షలను అందించింది. అయితే రాహుల్ కన్నా హౌస్ లో ఉన్న మిగితా కంటెస్టెంట్స్కే ఎక్కువ పారితోషకం లభించిందని తెలుస్తోంది. యాంకర్ శ్రీముఖికి 100 రోజులకగాను కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారట. దానికి కారణం ఆమె తన బిజీ షెడ్యూల్స్ ను పక్కన పెట్టి బిగ్ బాస్ కు వచ్చిన కారణంగా ఆమె అడిగినంత ఇచ్చారట. ఇక వరుణ్ సందేశ్ కు కూడా అదే మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన విన్నర్ గా రాహుల్ కు ట్రోఫీ దక్కింది కానీ...అతని కంటే మిగితా వాళ్లకు రెమ్యునరేషన్ ఎక్కువ వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.