
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను పెద్దగా వాడుకోకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ మొదట్లో హిట్లు చుసిన తేజ్ ఆ తరువాత వరుసగా ప్లాప్స్ ఎదురుకోవాల్సి వచ్చింది. తాజాగా 'చిత్రలహరి' సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ సక్సెస్ జోష్ తోనే కామెడీ చిత్రాలను తనదైన స్టయిల్ లో తెరకెక్కించే దర్శకుడు మారుతీతో "ప్రతిరోజు పండగే" లో నటిస్తున్నాడు. ధరమ్ తేజ్ కు జోడిగా రాశిఖన్నా నటిస్తుంది. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్ర కధ గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. తాజాగా ఈ సినిమాలో ధరమ్ తేజ్ కు ఒక జబ్బు ఉందని...కానీ ప్రతిరోజు పండగ లాగా ఉండాలి, అందరిని ఆనందంగా ఉంచాలనే కాన్సెప్ట్ తో ఈ కధ నడుస్తుందని సమాచారం. ఈ స్టోరీ లైన్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా? కొంచెం ఆలోచిస్తే ప్రభాస్ నటించిన చక్రం సినిమా గుర్తొస్తుంది. అందులో కూడా ప్రభాస్ కు జబ్బు ఉన్న సంగతి చెప్పకుండా చుట్టూ ఉన్నవాళ్ళ ఆనందాన్ని కోరుకుంటాడు. కానీ ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. మరి ఇంచుమించు అదే స్టోరీ లైన్ తో వస్తున్న ఈ సినిమా ఫలితం ఎం అవుతుందో చూడాలి.