
రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఇంటెర్నేష్నల్ లెవెల్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీ వరకే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ బాహుబలి తర్వాత బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో సుపరిచితుడు అయ్యాడు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కేవలం పాన్ ఇండియా సినిమాలే చేస్తాన్నని నిర్ణయించుకున్నాడు. తాజాగా సుజీత్ దర్శకతంలో రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో 'సాహు' చిత్రం రిలీజ్ అయినా విషయం తెలిసిందే. అయితే సినిమా చుసిన ప్రతి ఒక్కరు అనవసరమైన సీన్స్ లో ఎక్కువ ఖర్చు పెట్టారు అంటూ విమర్శలు వినిపించారు. ఇక సాహు ఇచ్చిన ఫలితానికి ప్రభాస్ కోలుకోవడానికి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముప్పై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తుంది. రెండో షెడ్యూల్ లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో రైలు సెట్ వెయ్యనున్నారట. దీనికోసం రూ. 2 కోట్లు ఖర్చుపెడుతన్నట్లు తెలుస్తుంది. పీరియాడిక్ చిత్రం అవ్వడంతో పాత కాలంలో రైలు భోగీలు ఎలా ఉండేవో..అలానే సెట్ వేయనున్నారు. ఇప్పటి వరకు బ్రేక్ లో ఉన్న ప్రభాస్ ఈ షెడ్యూల్ లో త్వరలో జాయిన్ కానున్నాడు.