
మొత్తానికి వచ్చేసింది! రెండు రోజుల క్రితం, ఈ రోజు ఉదయం పది గంటలకు సినిమాకు సంబంధించిన వివరాలు బయటపడతామని వారు వెల్లడించినట్లుగానే ఈరోజు ప్రభాస్ 20వ చిత్రం నిర్మాతలు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రాధ కృష్ణ చిత్రం 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ విషయానికి వస్తే, ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అద్భుతమైన బ్యాక్డ్రాప్ లో ఎర్రటి గౌనులో పూజ హెగ్డే మెరుస్తూ, తెల్లని సూట్లో ప్రభాస్ అదిరిపోయారు. ఎరుపు, పసుపు మరియు బంగారం వంటి రంగులతో, పోస్టర్ చాలా రాయల్ గా కనిపిస్తుంది. బాహుబలి విడుదలై ఐదేళ్లు అయిన రోజున ప్రభాస్ 20వ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ యొక్క ప్రకటన రావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాహుబలి, సాహో వంటి బ్యాక్ టూ బ్యాక్ యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఈ చిత్రం పీర్యాడిక్ లవ్ స్టొరీ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొన్ని అందమైన యూరోపియన్ దేశాలలో చిత్రీకరించారు. వాస్తవానికి, లాక్డౌన్లోకి వెళ్ళడానికి కొన్ని రోజుల ముందే జార్జియాలో షూట్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈరోజు పండగే.