
సందీప్ కిషన్ హీరోగా నటించిన "వెంకటాద్రి ఎక్స్ప్రెస్" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయం అయింది రకుల్ ప్రీత్ సింగ్. తన హవాభావాలతో, అందచెందలతో కుర్రకారు మనసు దోచుకొని టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా చెలామణి అయింది. అగ్రహీరోల నటించి వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడిపేసింది. అయితే ఈమధ్యకాలంలో మాత్రం రకుల్ జోష్ తగ్గిందని చెప్పక తప్పదు. మరి హీరోయిన్స్ ఎక్కువ అవ్వడం వల్లో లేదా ఇమే బోర్ కొట్టడం వల్లో తెలీదు కానీ రకుల్ కు ఆఫర్లు కరువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. ప్రభాస్ హీరోగా నటించిన "మిస్టర్ పర్ఫెక్ట్" లో తాప్సి క్యారెక్టర్ మొదట రకుల్ కె వచ్చిందట. కొన్ని రోజులు షూటింగ్లో కూడా పాల్గోనిందట. కానీ అప్పట్లో మిస్ ఇండియా తన లక్ష్యంగా భావించిన రకుల్ సినీ రంగం దానికి అడ్డొస్తుందని అనుకోని మధ్యలోనే ఆ సినిమాను తప్పుకుందట. ఆ సినిమా చేసుంటే రకుల్ మిస్టర్ పర్ఫెక్ట్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యేదనమాట.