
రాజకీయాల్లో అధికార పార్టీ, అపోసిషన్ పార్టీల మధ్య ఆరోపణలు సర్వ సాధారణం. నిత్యం ఏదోక రకంగా వార్తల్లో నిలవాల్సిందే. తాజాగా మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణ చేసింది. ఎలెక్షన్ కు కొద్ది రోజుల ముందు మా పార్టీ ముఖ్య నేతల ఫోన్లను హ్యాక్ చేసారని సంచలన ఆరోపణ చేసింది. కాంగ్రెస్ నేతల్లో ముఖ్య నేత, సోనియా గాంధీ తనయురాలు అయిన ప్రియాంక గాంధీ ఫోన్ ను వ్యాట్సాప్ మాల్ యాప్ ద్వారా మోడీ సర్కార్ హ్యాక్ చేసిందంటూ ఆరోపించింది. ఆమెదే కాకుండా మరికొంతమంది ముఖ్య నేతల ఫోన్లను కూడా హ్యాక్ చేసారంటూ వాపోయారు. ఏప్రిల్ లో ఈ సంఘటన జరిగిదని అంటున్న కాంగ్రెస్ నేతలు...దీనిపై విచారణ జరపాలని సీమాండ్ చేస్తున్నారు. సుమారు వెయ్యికు పైగా నేతల ఫోన్స్ హ్యాక్ చేసారని...న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థం ఎన్ ఎస్ వో స్పైవేర్ పెగాసన్ వ్యాప్తి చేసేందుకు వాట్సాప్ సర్వర్ ఉపయోగించిందని....కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మరి దీనిపై మోడీ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.