
అక్కినేని ఫ్యామిలీ ప్రతీ సంవత్సరం ఏఎన్నార్ గౌరవార్థం సినీ పరిశ్రమలో తమదైన ముద్ర వేసినవారికి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ను ప్రతి ఏడాది ఇస్తుంటారు. ఈ ఏడాది 17న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ను అందచేశారు. ఇందులో భాగంగా దివంగత నటి శ్రీదేవి, నటి రేఖ ఈ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, సినీ ప్రముఖులు, దర్శనిర్మాతలు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కు అక్కినేని కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు. అలానే, నాగచైతన్యను పెళ్లి చేసుకోని అక్కినేని కోడలిగా వెళ్లిన సమంత కూడా ఈసారి అవార్డ్ ఫంక్షన్ కు వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ వారి ఎదురుచూపులకు నిరాశే మిగిలింది. ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్న ఈ వేడుకలో అందాల సమంత కనిపించకపోవడం కొంత లోటుగా కనపడింది. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ సినిమా 96 రీమేక్ లో శర్వానంద్ కు జంటగా నటిస్తుంది సమంత.