
అల్లు అర్జున్ తెరపై కనిపించి చాలా కాలం అయింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు బన్నీ. సంవత్సరం దాటేసింది బన్నీ సినిమా చూసి. అందుకే ఆ గ్యాప్ భర్తీ చేసేందుకు వరసగా సినిమాలను లైన్ అప్ చేసాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల..వైకుంఠపురంలో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక&హాసిని సంయుక్తంగా నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది. జనవరి 12న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేసింది. టీజర్ తో పాటు సామజవరగమన, రాములో రాముల పాటలను రిలీజ్ చేసింది. సామజవరగమన ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో వేరే చెప్పాల్సిన పని లేదు. దీంతో ఈ పాట చిత్రీకరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది బృందం. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్న ఈ పాట చిత్రీకరణ కోసం టీం పారిస్ కు వెళ్లింది. ఈ సాంగ్ గురించి థమన్ ట్వీట్ చేస్తూ సామాజవరగమన ఆన్ ది వే అంటూ పోస్ట్ చేశాడు. దీని బట్టి బన్నీ ఫ్యాన్స్ కు ఫిస్ట్ ఖాయమని తెలుస్తోంది