
టాప్ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు... వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్ అవడం నేటి ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచింది. ముందుగా వారికి హౌ క్లీన్ యువర్ జర్నీ అనే టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా ఇంటి సభ్యులందరికీ ఒక్కొక్కరి పేరు రాసున్న రంగు బౌల్స్‌ను ఇచ్చారు. ఆ పేర్లు ఉన్న వ్యక్తులు టాప్ 5కు ఎందుకు అనర్హులు కాదో చెప్పి రంగు పోయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా బాబా భాస్కర్.. అలీ తన గురించి మాట్లాడిన విషయాలు బాధపెట్టాయంటూ అలీపై రంగు పోశాడు. తర్వాత శ్రీముఖి.. శివజ్యోతి ఎమోషనల్ వ్యక్తి.. కాబట్టి తను ఫైనలిస్టుకు అర్హురాలు కాదంటూ ఆమెపై రంగు గుమ్మరించింది. ఇక శివజ్యోతి... కోపంలో వరుణ్ మాట్లాడిన విధానం నచ్చలేదంటూ అతడిని అనర్హుడిగా తేల్చింది. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడంటూ వరుణ్‌పై రంగు చల్లింది.